కోమటిచెరువుపై హరీశ్‌రావు సైకత శిల్పం..

harish-rao-03.jpg

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై ఉన్న అభిమానాన్ని పార్టీ నాయకులు వినూత్నంగా చాటుకున్నారు. సిద్దిపేటలోని కోమటి చెరువుపై హరీశ్‌రావు సైకత శిల్పం వేయించారు. పట్టణానికి చెందిన పార్టీ సీనియకులు మచ్చ వేణుగోపాల్‌ కోమటి చెరువుపై హరీశ్‌రావు సైకత శిల్పం వేయించారు. మంగళవారం ఉదయం అక్కడే కేక్‌ కట్‌చేసి హరీశ్‌రావు జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ రాజనర్సు, పార్టీ అధ్యక్షుడు కొండం సంపత్‌ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు, కోమటి చెరువు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Share this post

scroll to top