తెలంగాణ అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తూ జీరో అవర్ నిర్వహించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల సాక్షిగా అసెంబ్లీ లో ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని ఆరోపించారు. అదేవిధంగా విపక్షంలో తమతో పాటు ఉన్న ఎంఐఎం పార్టీకి కూడా మంత్రులను ప్రశ్నలు అడిగేందుకు కనీస అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రశ్నించినా ఆయన నుంచి సమాధానం లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని కామెంట్ చేశారు.
కాంగ్రెస్ సర్కార్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది..
