పశువైద్య సంచార వాహన సేవల్లో అంతరాయం కలుగుతోంది. మూగజీవుల మౌనరోదనను తొలగించడంలో ప్రభుత్వం విఫలమైంది. వాటి సంరక్షణపై నిర్లక్ష్యం వహించడం శోచనీయం. పశు వైద్యశాలల్లో గత 9 నెలల నుంచి మందుల కొరత తీవ్రంగా ఉన్నది. ప్రస్తుతం అధికార, విపక్ష నేతల మధ్య రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతున్న పలు అంశాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. ఇటు వారి విమర్శలకు ధీటుగా ప్రతి విమర్శలు చేస్తున్నారు అధికార పక్ష నేతలు. మొత్తంగా గత కొద్ది రోజుల నుంచి వాడివేడి రాజకీయ వాతావరణం నెలకొన్నది రాష్ట్రంలో అయితే, తాజాగా కూడా మాజీ మంత్రి హరీశ్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. పశు వైద్యశాలల్లో మందుల కొరతపై ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
మూగజీవుల సంరక్షణపై నిర్లక్ష్యం..
