మోసం చేశాడని హర్షసాయిపై హీరోయిన్ ఫిర్యాదు..

sai-25.jpg

అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న యూట్యూబర్ హర్షసాయి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. తన కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారని తెలుసుకుని ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక హర్షసాయి కుటుంబం కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని, వాళ్ల ఆచూకీ కూడా తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా హర్షసాయి తనని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే హర్షసాయి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెబుతోంది.

Share this post

scroll to top