గులాబి కండువాపై చర్చ..

harish-rao-18.jpg

గులాబీ పార్టీ ఉద్యమ పార్టీగా ప్రజలకు చేరువై రాష్ట్రాన్ని సాధించి ప్రజల మన్ననలు అందుకుంది. అప్పట్లోనే పేరు మార్పుపై క్యాడర్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి గా పేరు మార్చడంపై కార్యకర్తల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు సీనియర్ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేరు మార్చడంతో స్థానిక వాదం బలహీనపడిందని.. ఈ కారణంతో నే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైందని బీఆర్ఎస్ లోని ఓ వర్గం బలంగా చెప్తోంది. మళ్లీ పేరు మారిస్తే తప్ప తెలంగాణలో ఓటర్లు బీఆర్ఎస్ ను నమ్మరని గట్టిగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు గడిచాయి. పదేళ్ల అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో తనదైన మార్క్ వేసుకుంది. పార్టీ పేరు మార్చడంతో తెలంగాణ ప్రజలకు పార్టీ దూరమైందన్న వాదనను కొంతమంది ఉద్యమకారులు తెరపైకి తెచ్చారు. ఈ ప్రభావం అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికలలో ప్రత్యక్షంగా కనిపించింది. అప్పటినుంచి పేరు మార్పుపై సతమతమవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ హరీష్ రావు ఖండువా మార్చి పెద్ద చర్చకు దారితీశారు. మరి తెలంగాణ ప్రజలు దీనిని ఎలా స్వాగతిస్తారో చూడాలి.

Share this post

scroll to top