స్కూల్ విద్యార్థులకు లైంగిక వేధింపులు..

school-24-.jpg

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఆలయం వంటి విద్యాలయాన్ని అకృత్యాలకు వేదికగా చేసుకున్నాడో ఘనుడు. అభం శుభం తెలియని విద్యార్థినులపై వికృత చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తన సెల్ ఫోన్ లో బ్లూ ఫిల్మ్ చూపిస్తూ చిన్నారుల శరీరంపై చేతులు వేసి నొక్కుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. ఈ దారుణమైన ఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరులో వెలుగు చూసింది. విద్యార్థులకు విద్యా బుద్దిలు నేర్పే గురువే కామంతో తన స్థానాన్ని మరచి సభ్య సమాజం తల దించుకొనే విధంగా ప్రవర్తిన్నాడు. ఎస్సీ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల హెడ్ మాస్టర్ సుప్రసాద్ అభం, శుభం తెలియని విద్యార్థినులపై వికృత చేష్టలు చేస్తూ గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.

Share this post

scroll to top