కేసులపై సర్కార్‌ అప్రమత్తం.. 

hmpv-allert-07.jpg

దేశంలో HMPV వైరస్ కలకలం బయటకు వెళితే మాస్క్‌ పెట్టుకోవాలి. ఎవరినైనా టచ్‌ చేస్తే శానిటైజర్‌రాసుకోవాలి. మనిషిని చూసి మనిషి భయపడుతూ బతికిన కాలం అది. కలి కాలం కంటే ఘోరమైన కరోనా కాలం. ఆ కరోనా కాలాన్ని గుర్తుస్తూ ప్రజల్ని హడలెత్తిస్తోంది HMPV వైరస్‌ అలియాస్‌ హ్యుమన్‌ మెటానిమో వైరస్‌. నిన్నటిదాకా చైనాను వణికించిన HMPV వైరస్‌ ఇప్పుడు ఇండియాలో అడుగు పెడుతూనే విజృంభించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4 HMPV వైరస్‌ కేసులు నమోదైనట్టుగా తెలిసింది. ఇందులో రెండు కర్ణాటక రాజధాని బెంగళూరులో, మరో కేసును గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గుర్తించారు. కోల్‌కతాలో ఐదు నెలల చిన్నారికి HMPV పాటిజివ్‌గా తేలింది. బెంగళూరులో 3, 8 నెలల వయసు కలిగిన ఇద్దరు చిన్నారులకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్‌గా తేలగా అహ్మదాబాద్‌లో 2 నెలల చిన్నారికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కర్ణాటకలో పెరుగుతున్న వైరస్ కేసుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. 

Share this post

scroll to top