అర్ధరాత్రి దంచికొట్టిన భారీ వర్షం..

rain-22.jpg

బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో నిండు వేసవి కాస్త వర్షాకాలం గా మారిపోయింది. ద్రోణి ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధి మొత్తం బుధవారం ఉదయం నుంచి ముసురు కమ్మేసింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. అయితే సాయంత్రం సమయానికి గ్రేటర్ పరిధిలోని మూడు పట్టణాలను దట్టమైన మేఘాలు కమ్మెయడంతో రాత్రి 7 గంటల నుంచి భారీ వర్షం కురిసింది.

ముఖ్యంగా అర్ధరాత్రి వరకు కురిసిన కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్ లోని ప్రధాన రహదారులు అన్ని చెరువులును తలపిస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే బుధవారం కురిసిన వర్షపాత వివరాలను TGDPS విడుదల చేసింది. దీని ప్రకారం నగరంలో ఒక్కరాత్రిలోనే 100mm వరకు వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యధికంగా సంతోష్ నగర్ 98.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా హఫీజ్‌పేట 40 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది.

Share this post

scroll to top