ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్ర కోస్తాలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉందని చెప్పారు. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
