తెలుగు రాష్ట్రాలపై వరుణుడు కనికరం చూపించేలా లేడు. ఇప్పటికే 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో 48 గంటల పాటు వరుణగండం వెంటాడుతోంది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. మరికొద్ది సేపట్లో ఈ వాయుగుండం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో రెండు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మరో 48 గంటలపాటు అతి భారీ వర్షాలు..
