ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. AA-22వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇటీవల మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసి అందరిలో అంచనాలను పెంచేశారు. అయితే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో రాబోతున్నట్లు టాక్. AA-22 సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు కూడా మొదలుపెట్టారు. అల్లు అర్జున్ కూడా తన మోకోవర్ను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ యాంటిసిపేటెడ్ మూవీలో అల్లు అర్జున్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు టాక్. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ఆమెకు చెప్పడంతో కథ నచ్చి నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ కూడా మొదలుకాబోతుందట. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా వావ్ కాంబో అదిరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. అయితే మృణాల్ తో పాటు ఇందులో జాన్వీ కపూర్, దీపికా పదుకొణె కూడా నటిస్తున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వీరిద్దరికి సంబంధించిన సీన్స్‌ను కూడా త్వరలోనే చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత అనేది తెలియనప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వార్త అయినా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.