నన్ను సినిమా హిట్ అయినా ప్రమోషన్స్‌కు పిలవలేదు.. 

priyanka-08.jpg

 ఓ యంగ్ హీరోయిన్ తనను సినిమా ప్రమోషన్స్ కు పిలవలేదు అని తెలిపింది. సినిమా విడుదలకు ముందు, విడుదలైన తర్వాత కూడా తనను ప్రమోషన్స్ కు పిలవలేదు అని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు. మన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. ఈ అమ్మడు షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా మారింది ఈ చిన్నది. ఆతర్వాత ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాతో మరో హిట్ అందుకుంది.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేకపోయింది ఈ చిన్నది. రీసెంట్ గా మ్యాడ్ 2 సినిమాలో మెరిసింది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో మీరు ఎందుకు ఎస్ ఆర్ కల్యాణమండపం ప్రమోషన్స్ లో కనిపించలేదు అని యాంకర్ అడగ్గా నన్ను పిలవలేదు అని సమాధానం ఇచ్చింది. మాట్లాడుతూ సాంగ్స్ , టీజర్ క్లిక్ అయ్యాయి కదా ప్రమోషన్స్ ఎక్కువ అవసరం లేదు ఏమో అని అనుకున్నాను. నన్ను పిలిస్తే నేను వెళ్లేదాన్ని కానీ పిలవలేదు. ఎప్పుడు పిలిచారంటే సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత ఆహా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సమయంలో నన్ను పిలిచారు. రిలీజ్ కు ముందు పిలవలేదు ఇప్పుడు పిలిచినా ఏం లాభం అనిపించింది అని తెలిపింది. ఇక ప్రియాంక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Share this post

scroll to top