బుడమేరకు పెరుగుతున్న వరద..

danger-9.jpg

బుడమేరుకు పడిన గండి పూడ్చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు, ప్రజలు.  విజయవాడలో గ్యాప్ లేకుండా పడుతున్న వానలు నగర ప్రజలను నిద్రలేకుండా చేస్తున్నాయి.  ఇప్పుడు మరోసారి విజయవాడను భయపెడుతోంది ఈ వాగు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మళ్లీ బుడమేరుకు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజయవాడ మున్సిపల్ కమీషనర్ ధ్యాన చంద్ర రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముంపు ప్రాంతాలను వీడాలని కోరారు. వాగుకు మళ్లీ వరద నీరు వచ్చి చేరుతుందని, దీంతో ముప్పు పొంచి ఉందని, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు.

Share this post

scroll to top