రాష్ట్రంలో బీసీ,ఎస్సి,ఎస్టీ మైనారిటీ గురుకులాల్లో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, హాస్టల్‌లు, తరగతి గదులు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖల మంత్రి పోన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఇందులో రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు అధికంగా వస్తున్న నేపథ్యంలో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గురుకుల పాఠశాలలో వాటర్ ట్యాంకులు శుభ్రం చేసి, తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
గురుకులాల్లోని విద్యార్థులకు వైద్య పరీక్షలు.. మంత్రి పొన్నం ఆదేశాలు..
