ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఆలివ్ ఆకుల్లో కూడా ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు, చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా. ఆలివ్ ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం మెరుగుపడుతుంది. ఆలివ్ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆలివ్ ఆకులు రక్తపోటు, కొలెస్ట్రాల్ రెండింటినీ తగ్గించగలవు. ఆలివ్ ఆకు సారాన్ని తింటే ధమనుల్లో పూడికలు తగ్గిపోతాయి.
పసుపుతో పాటు ఈ మొక్క ఆకులు కూడా ఎన్నో రకాల పోషకాలు నిండివున్నాయని చెబుతున్నారు. వీటిలో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం, ధమనులతో పాటు శరీర కణాల్లో వాపును తగ్గించగలదు. పసుపు ఆకులను కూరల్లో వేసుకొని తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆలివ్ టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఖాళీ కడుపుతో ఆలివ్ టీ తాగడం వల్ల శరీరం నిర్విషీకరణ చెందుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే దీని టీ తాగడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. రోజంతా ఫ్రెష్ గా అనిపిస్తుంది.