భారతదేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెడుతుంది. దేశ ఆర్థిక దిశాదశానిర్ధేశాన్ని శాసించే ఈ బడ్జెట్‌పై దేశ ప్రజలు ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌తో వరుసగా ఏడు ఫుల్‌టైమ్ బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక మంత్రిగా నిర్మలమ్మ రికార్డు క్రియేట్ చేయనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈ రోజు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సామాన్యులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. నేటి ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. బీజేపీ నేతృత్వంలోని NDA మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇదే కావడంతో అంత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరి చూపు ఈ బడ్జెట్ పై పడింది.
బడ్జెట్ పై దేశ ప్రజలు ఎన్నో ఆశలు, అంచనాలు..
