మెట్రో రెండోదశ విస్తరణ పనుల్లో వేగం పుంజుకుంటున్నది. సెకండ్ ఫేజ్‌లో ప్రతిపాదించిన ఆరు కారిడార్లకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు ను సిస్ర్టా కన్సల్టెన్సీతో తయారు చేయించిన అధికారులు, తాజాగా జాతీయ రహదారులపై నుంచి చేపట్టనున్న మెట్రోపనులపై దృష్టి సారించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 22న మెట్రో రెండోదశ విస్తరణకు సంబంధించిన రూట్‌మ్యా్‌పను ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా పనుల డీపీఆర్‌ను హెచ్‌ఏఎంఎల్ అధికారులు దాదాపుగా పూర్తి చేశారు. పలు ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి వచ్చే అడ్డంకులు, కావాల్సిన భూసేకరణపై లోతుగా పరిశీలిస్తున్నారు. రూ.20 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టు ద్వారా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు.
మియాపూర్-పటాన్చెరువు రూట్లో డబుల్ డెక్కర్ బస్సులు..
