గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలు చాలా బిజీగా ఉంటారు. రాష్ట్రంలో ఉన్న వారంతా బిజీగానే ఉంటారు. ఐతే గ్రేటర్ వారికి బిజీ మరింత ఎక్కువగా ఉంటుంది. సమయమంతా ట్రాఫిక్ జామ్ లోనే అయిపోతూ ఉంటుంది. దాంతో వారు కొన్ని రకాల బిల్లులను చెల్లించే విషయంలో ఆలస్యం చేస్తుంటారు. దాంతో అవి ఎప్పటికప్పుడు పెండింగ్ అవుతూ ఉంటాయి. ఎలాగైనా వారితో బిల్లులు కట్టించుకోవాలని ప్రభుత్వం కనెక్షన్ కట్ చేస్తామని వార్నింగ్ ఇస్తుంది. అయినప్పటికీ చాలా మంది టైమ్ లేదు అని వాయిదా వేస్తుంటారు. హైదరాబాద్ పరిధిలో నల్లా బిల్లులు చెల్లించని వారికి ప్రభుత్వం ఈ వన్‌టైమ్ సెటిల్మెంట్ ఆఫర్ తెచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో పెండింగ్ నల్లా బిల్లులు చెల్లించేలా ఈ ప్లాన్ ఉంది. ఇందులో భాగంగా ప్రజలు అసలు బిల్లు కడితే సరిపోతుంది.
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త..
