సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దారుణ ఘటన చోటుచేసుకున్నది. మేడ్చల్ వైపునకు వెళ్తోన్న MMTS రైల్లో యువతిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు గురైన సదరు యువతి గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్‌లోంచి దూకేసింది. తీవ్ర గాయాలతో పడివున్న ఆమెను స్థానికులు గమనించి రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న సిబ్బంది. అంబులెన్సు ఆమెను ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు అనంతపూర్‌లోని ఉరవకొండకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. మేడ్చల్‌లోని ఓ ప్రయివేట్ హాస్టల్‌లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కదులుతున్న ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం..
