భూసేకరణ పూర్తయ్యాకే ప్రాజెక్టు నిర్మాణం..

hyd-9.jpg

తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర రవాదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ క్వశ్చన్ అవర్‌లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ఆయన తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేసి ఇచ్చాకే రింగురోడ్డు నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం హైదరాబాద్ చుట్టూ.. రూ.17 వేల కోట్ల విలువైన రింగురోడ్డు మంజూరు చేశామని చెప్పారు.

గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ తామే చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. ఆ వ్యయంలో 50 శాతం భరిస్తామని స్పష్టం చేసిందన్నారు. ప్రభుత్వం మారాక కొత్త ముఖ్యమంత్రి వచ్చి దీనిపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసిన తర్వాతే హైదరాబాద్‌ చుట్టూ రీజినల్ రింగు రోడ్డు నిర్మిస్తామన్నారు. హైదరాబాద్‌ రీజినల్‌ రింగురోడ్డు, జాతీయ రహదారి 765లోని హైదరాబాద్‌-శ్రీశైలం సెక్షన్‌ ప్రాజెక్టులు డీపీఆర్‌ దశలో ఉన్నట్లు వెల్లడించారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి విస్తరణకు నెల రోజుల్లోపు పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

Share this post

scroll to top