రాష్ట్ర రాజధాని నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులను హడలెత్తిస్తున్న హైడ్రాపై పోరాటానికి బీజేపీ రెడీ అవుతోంది. హైడ్రా దూకుడును అడ్డుకునేందుకు అవసరమైన అన్ని మార్గాలను వినియోగించుకోవాలని భావిస్తోంది బీజేపీ. ఇందుకోసం న్యాయ పోరాటంతోపాటు కేంద్ర ప్రభుత్వ అధికారాలను వాడుకునే విషయమై ప్రణాళిక రచిస్తోంది. ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలపై తొలుత బీజేపీలో కొంత గందరగోళం కనిపించింది. కాలక్రమేణా ఆ గందరగోళం ఇప్పుడు తెరమరుగైంది. హైడ్రా పేరిట పెద్దలకో న్యాయం పేదలకు మరో న్యాయం అనుసరిస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కాలని నిర్ణయించినట్లు సమాచారం.
బీజేపీ హైడ్రాపై పోరాటానికి రెడీ..
