రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు మళ్లీ కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం మరిన్ని కూల్చివేతలను మొదలుపెట్టాయి. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్‌లో ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అమీన్‌పూర్ పరిధిలోని పలు నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు సమీపంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
అమీన్‌పూర్‌లో కూల్చివేతలు మొదలుపెట్టిన అధికారులు..
