బుల్లితెర సెలెబ్రిటీలు సుడిగాలి సుధీర్, యాంకర్ రవిలు ఇటీవల ఓ టీవీ షోలో స్కిట్ చేయగా అది కాస్త వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘బావగారు బాగున్నారా’ సినిమాలోని ఓ సీన్‌ను రీ-క్రియేట్ చేయగా అది కాస్త విమర్శలకు దారితీసింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా, హిందూ దేవుళ్లను అనుమానించేలా సుధీర్, రవి ప్రవర్తించారంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సుధీర్, రవి ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదంపై తాజాగా రాష్ట్రీయ వానరసేన అనే హిందూ ఆర్గనైజేషన్ నుంచి కేశవ రెడ్డి అనే వ్యక్తి రవికి ఫోన్ చేయగా తాను ఇండియన్ అని, ఏ తప్పుచేయలేదని, క్షమాపణ చెప్పను అని సమాధానం ఇచ్చారు.
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా టీవీ షోలో ఎందుకు ప్రవర్తించారు అని యాంకర్ రవిని కేశవ రెడ్డి ప్రశ్నించారు. నందీశ్వరుడి నుంచి శివుడిని చూస్తే అమ్మాయి కనిపిస్తోందని ఎలా అంటార? అని నిలదీగయా అది చిరంజీవి గారు బావగారు బాగున్నారా సినిమాలో చేశారని, చిరంజీవి గారే చేశారని తామూ చేశామని రవి సమాధానం ఇచ్చారు. చిరంజీవి గారు అంటే మాకు ఎంతో ఇష్టమని, ఆయన ఏం చేసినా తాము చేస్తామన్నారు. అప్పుడే మీరు చిరంజీవి గారికి తప్పని చెబితే ఇప్పుడు మాకు తెలిసేది కదా? అని వంకరగా బదులిచ్చారు. సమాజాన్ని కించపరిచేలా తాము ఏదీ చేయలేదన్నారు. తాము చేసిన స్కిట్‌కు సంబందించిన వీడియోను తీసేశామని రవి చెప్పుకొచ్చారు. వీడియో తీశారు ఓకే, హిందువులకు క్షమాపణ చెప్పండి అని కేశవ రెడ్డి అనగా తాను ఏ తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పని బదులిచ్చారు. ఇందుకు సంబందించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.