ఈ మధ్య కాలంలో ఎక్కువగా మహిళలు ఇంటి బాధ్యతలు, పిల్లలు, ఉద్యోగం అంటూ బిజీ అయిపోతున్నారు. దీంతో సరైనా ఆహారం తీసుకోకపోవడంతో ఎక్కువగా ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మహిళలు తీసుకునే ఆహారంలో కూరగాయలు, ఆకు కూరలు, విత్తనాలు, పండ్లను భాగం చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
*మహిళలు పీరియడ్స్ టైంలో ఎక్కువగా బలహీనతగా ఉంటారు. ఈ టైంలో స్త్రీలలో వచ్చే మూడ్ స్వింగ్స్ సమస్యకు చెక్ పెట్టడంలో విటమిన్ బి 12 ఉపయోగపుడుతుంది. ఇందుకోసం బాదంపప్పు, గుడ్లు, పుట్ట గొడుగులను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే స్త్రీలు ఆహారంలో మాంసం, చీజ్, పాలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.