రోజూ పడుకునే ముందు పాలలో బెల్లం కలుపుకుని తింటే మంచి నిద్ర..

milk-07.jpg

రాత్రి పడుకునే ముందు బెల్లం పాలను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, పాలలోని కాల్షియం వల్ల రాత్రిపూట దీనిని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. బెల్లం కాలేయంలోని మలినాను శుద్ది చేస్తుంది. రాత్రి పూట బెల్లం పాలు తాగితే ఉదయానికి శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. పాలలో ఉండే కాల్షియం కండరాల నొప్పులను తగ్గిస్తుంది. బెల్లంలోని ఐరన్ రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని పాలలో బెల్లం కలిపి తాగడం వల్ల పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజూ పాలలో బెల్లం కలిపి తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

రోజూ పడుకునే ముందు పాలలో బెల్లం కలుపుకుని తింటే మంచి నిద్ర పడుతుంది. ఇది నిద్రలేమి సమస్యను కూడా దూరం చేస్తుంది. స్త్రీలలో వచ్చే రుతుక్రమ సమస్యలకు కూడా పాలు-బెల్లా మంచి ఇంటి నివారణ. మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ బెల్లం పాలు తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, పాలలోని పోషకాల వల్ల రాత్రిపూట తాగితే చర్మం కాంతివంతమవుతుంది. రాత్రిపూట పడుకునే ముందు బెల్లం పాలను తాగితే మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీనిని పాలతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది.

Share this post

scroll to top