హైదరాబాద్‌ లో నిరంతరం కొనసాగుతున్న ఫుడ్‌ సెఫ్టీ అధికారులు తనిఖీలు..

food-safty-07.jpg

హైదరాబాద్‌ లో ఫుడ్‌ సెఫ్టీ అధికారులు తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ నగరంలోని సంతోష్ నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. శ్రీ రాఘవేంద్ర, ఉడిపి, సంతోష్ హోటల్స్ లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించట్లేదన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్స్ కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. హోటల్స్ లో ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ఇంగ్రిడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు షాక్‌ తిన్నారు.

అంతేకాకుండా హోటల్స్ లో కుళ్లిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నట్లు గుర్తించారు. ఫంగస్ వచ్చిన అల్లం స్టోర్ రూమ్ లో గుర్తించారు. దీనితో వంటకాలు చేస్తున్నట్లు తెలిపారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని హోటల్‌ యాజమాన్యంపై మండిపడ్డారు. హోటల్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హోటల్‌ ను సీజ్‌ ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఫుడ్‌ సెఫ్టీ లేకుండా ఇలాంటి ఆహారం ప్రజలకు పెడుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి ఆహారం తినే భోజన ప్రియులు అనారోగ్యానికి గురి అవుతున్నారని తెలిపారు.

Share this post

scroll to top