భగవద్గీత స్పూర్తితోనే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని, ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులు అక్రమించిన వారి భరతం పడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోకాపేటలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అనంత శేశ స్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హైడ్రా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను నిజాం ఆనాడే లేక్ సిటీగా గుర్తించి గొలుసు కట్టు చెరువుల నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. కరువు వచ్చిన సమయంలో గండిపేట, ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయి. కానీ కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫాం కట్టుకొని, ఆ నాళాలు గండిపేటలో కలిపారని, ఇప్పుడు వాటిని తాగునీటిగా ఉపయోగించేందుకు ఇబ్బందిగా మారిందని తెలిపారు.
హైడ్రాకు ఇన్‌స్పిరేషన్ భగవద్గీత..
