జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్..

jani-03.jpg

అత్యాచార ఆరోపణలతో అరెస్టయిన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేసింది. నాకు ఇటీవ‌ల ఉత్తమ‌ నృత్య‌ ద‌ర్శ‌కుడిగా అవార్డు వ‌చ్చింది. ఢిల్లీ వెళ్లి అవార్డు అందుకోవాల్సి ఉంది. ఐదు రోజుల మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వండి’ అని జానీ కోర్టును కోరాడు. అతడి దరఖాస్తును పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకూ బెయిల్‌ మంజూరు చేసింది. 10వ తేదీ కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. 

Share this post

scroll to top