అఖిల్ అక్కినేని పెళ్లి డేట్, ప్లేస్ ఫిక్స్..

akil-21-.jpg

నాగార్జున తనయుడు హీరో అఖిల్ అక్కినేని గత సంవత్సరం నవంబర్ 26న జైనబ్ రవ్జీతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వినిపిస్తుంది. ఇటీవల డిసెంబర్ లో అఖిల్ అన్న నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇక అఖిల్ పెళ్లి చేసుకోబోయే జైనబ్ రవ్జీ అఖిల్ కంటే 9 ఏళ్ళు పెద్ద అని సమాచారం. జైనబ్ రవ్జీ థియేటర్ ఆర్టిస్ట్, పెయింట్ ఆర్టిస్ట్. అలాగే ఆమెకు బ్యూటీ కేర్ కి సంబంధించిన బిజినెస్ కూడా ఉంది. ఈమె ప్రముఖ బిజినెస్ మెన్ అయిన జుల్ఫీ రవ్జీ కూతురు. ఈయనకు ఇండియాతో పాటు లండన్, దుబాయ్ దేశాల్లో కూడా బిజినెస్ లు ఉన్నాయి. జైనాబ్ రవ్జీ తండ్రి జుల్ఫీ రవ్జీ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు సన్నిహితుడు.

నాగార్జునకు కూడా బిజినెస్ పరంగా సన్నిహితుడు అని తెలుస్తుంది. అఖిల్, జైనబ్ రవ్జీ ది కొంతమంది ప్రేమ పెళ్లి అని, రానా పెళ్ళిలో కలిసి ఫ్రెండ్స్ అయి అనంతరం ప్రేమించుకున్నారని అంటున్నారు. పలువురు మాత్రం నాగార్జున, జుల్ఫీ రవ్జీ మధ్య వ్యాపార సంబంధాలు, స్నేహంతో పెద్దలు కుదిర్చిన పెళ్లి అని అంటున్నారు. చూడాలి మరి అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో. అధికారికంగా అయితే డేట్ పై ప్రకటన లేదు. మరోవైపు వరుస ఫ్లాప్స్ లో ఉన్న అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత అధికారికంగా ఎలాంటి సినిమా ప్రకటించకపోయినా ప్రస్తుతం యువీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేస్తున్నాడు. మరో సినిమా కూడా ఓకే చేసాడని సమాచారం.

Share this post

scroll to top