రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగకు కవిత బ్రాండ్ అంబాసిడర్ లాంటిది. ఆడబిడ్డల సంబరాన్ని అంబరాన్ని తాకేలా కవిత చేసారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు కారణాలు ఏవైనా ఈసారి బతుకమ్మ పండుగకు ఆమె దూరంగా ఉండటం పొలిటికల్ గానే కాకుండా ట్రెడిషనల్ గా కూడా చర్చనీయాంశంగా మారింది. పండుగలతో జనాన్ని జాగృతం చేసి ఉద్యమాలలో వారిని భాగం చేయొచ్చు అని కవిత నిరూపించారు ఉద్యమాలలో పూల పండుగను భాగం చేసిన కవిత ఈసారి జరిగే బతుకమ్మ వేడుకలలో పాల్గొనే పరిస్థితుల్లో లేరనేది పార్టీ వర్గాలు చెబుతున్న మాట ఈసారి ఆమె బతుకమ్మ వేడుకలలో పాల్గొనక పోవడం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆవేదాన్ని కలిగిస్తోంది.
బతుకమ్మ వేడుకలకు కవిత దూరమైనట్లేనా..
