టాలీవుడ్ లో తెలంగాణపై ఇదేం వివక్ష..

aswini-3.jpg

తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు జనజీవనాన్ని కకావికలం చేస్తున్నాయి. అయితే ఈ వరద సాయం విషయంలో మరోసారి టాలీవుడ్ లో ప్రాంతీయ వివక్ష చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వరద సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. రేపటి కోసం అంటూ క్యాప్షన్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన చేసింది. అయితే వైజయంతీ మూవీస్ చేసిన ఈ ప్రకటన తెలంగాణ ప్రజలకు కోపం తెప్పిస్తోంది.

రెండు రాష్ట్రాల్లో వరద ప్రభావం ఉందని, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దఎత్తున విధ్వంసం జరిగితే కేవలం ఏపీ ప్రభుత్వానికి మాత్రమే విరాళం ప్రకటించి తెలంగాణ పట్ల వివక్ష చూపడం ఏంటని పలువురు నెటిజన్లు నిలదీస్తున్నారు. టాలీవుడ్ పెద్దలు గతంలోనూ తెలంగాణ పట్ల ఇదే తరహా వివక్ష చూపించే వారని ఇదే తంతు కంటిన్యూ అవుతున్నదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కల్కీ సినిమా ద్వారా కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించిన వైజయంతీ మూవీస్ సంస్థ ప్రముఖులు తెలంగాణలో ఉంటూ తెలంగాణలో సినిమాలు చేస్తూ ఇక్కడి ప్రజల నుంచి లాభాలు పొందుతూ విరాళాల విషయంలో వివక్ష చూపడం సరికాదని మండిపడుతున్నారు.

Share this post

scroll to top