విశాఖపట్నం సాగర్ నగర్ లోని ఇస్కాన్ మందిరంలో శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద ఇస్కాన్ ఆలయం ఇది. ఉత్సవాలలో మొదటిదైన ఈ రోజు కార్యక్రమము మంగళ హరతితో మొదలయ్యింది. తదుపరి ప్రత్యేక భక్త బృందముతో విశాఖలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా చేశారని భక్తులు అంటున్నారు. మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చాను అని తెలుపుతున్నారు.
ఇస్కాన్ ఆలయం సాగర్ నగర్ లో ఉంది. విశాఖపట్నం సాగర్ తీరంలో భీమిలికి వెళ్లే మార్గంలో ఈ ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తుంది. ఈ రోజు ఉత్సవంలో భాగంగా భక్తులు వారి స్వహస్తాలతో స్వామివారిని అభిషేకము చేసుకునే సదవకాశము కల్పించబడినది. ఈ అభిషేకానికి పుణ్య నదుల నుండి సేకరించిన జలాలు మరియు పంచామృతాలతో చేస్తున్నారు. ఇలా స్వామివారిని దర్శించుకోవడం తమకు ఎంతో భాగ్యమని భక్తులు అంటున్నారు. వందలమంది భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకున్నారు.