వైయ‌స్ఆర్‌సీపీ అనుబంధ విభాగాల అధ్య‌క్షుల నియామ‌కం..

ys-jagan-24.jpg

 వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్ రెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష, ఐటీ విభాగం అధ్యక్షుడిగా సునీల్, వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా కిరణ్ రాజు, గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడిగా నారాయణమూర్తి, టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడిగా నాగిరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా కల్యాణి, ట్రేడ్ యూనియన్ విభాగం అధ్యక్షుడిగా గౌతమ్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఖాధర్ బాషా, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా విశ్వేశ్వర రాజును నియమిస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు జగన్‌ శ్రీకారం చుట్టారు. పార్టీలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కొత్తగా ముగ్గురికి బాధ్యతలు అప్పగించారు.

Share this post

scroll to top