వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త ఏడాది జనం లోకి రావాలని చూస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల పాటు టైం ఇచ్చిన జగన్ ఇపుడు జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. కొత్త ఏడాది సంక్రాంతి పండుగ తరువాత జగన్ జిల్లాల టూర్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ యంత్రాంగం రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసింది. ఏపీలో ఉన్న పాతిక ఎంపీ సీట్ల ప్రాతిపదికన జగన్ టూర్ సాగుతుందని అంటున్నారు. ప్రతీ పార్లమెంట్ పరిధిలో జగన్ రెండు రోజుల పాటు మకాం చేస్తారు అని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో పాటు జనంతోనూ మమేకం అవుతారని వారి నుంచి సమస్యల వినతి పత్రాలు తీసుకుంటారని అదే విధంగా గ్రౌండ్ లెవెల్ లో కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో వాకబు చేస్తారు అని అంటున్నారు.
సంక్రాంతి పండుగ తరువాత జగన్ జిల్లాల టూర్లకు రంగం సిద్ధం..
