ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను అనుసరించి 25 మంత్రి పదవులకు ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. జనసేన నుంచి ముగ్గురు మంత్రులుగా ఉండగా.. కూటమి పొత్తులో భాగంగా 4 మంత్రి పదవులు రావాల్సి ఉంది. ఈ క్రమంలో నాగబాబు మంత్రిమండలిలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు..
