జనసేన అధినేత పవన్కల్యాణ్ సోదరుడు నాగబాబు ఎల్లోమీడియాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు నాగబాబు తన ఎక్స్ ఖాతాలో శుక్రవారం ఒక పోస్టు చేశారు. తనకు రాజకీయ పదవులపై ఆసక్తి లేదని నాగబాబు కుండబద్దలు కొట్టారు. పవన్ ఢిల్లీ పర్యటనపై కొన్ని రోజులుగా ఏదేదో ప్రచారం చేస్తున్న ఎల్లోమీడియాకు తన ట్వీట్తో తాజాగా షాకిచ్చారు నాగబాబు. పవన్ ఢిల్లీ పర్యటన నాగబాబు కోసమేనని ఎల్లోమీడియా ఊదరగొడుతున్న విషయం తెలిసిందే. నాగబాబుకు రాజ్యసభ సీటు కావాలని పవన్ తన టూర్ లో బీజేపీ పెద్దలను కోరినట్టు ఎల్లోమీడియా వార్తలు ప్రసారం చేసింది. ఈ ప్రచారంపై నాగబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఇందుకే ఆయన ఎక్స్లో క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.
ఎల్లోమీడియాకు గట్టి కౌంటర్..
