జాన్వీ కపూర్‌తో నాని సినిమా.. 

nani-26.jpg

నేచురల్ స్టార్’ నాని హీరోగా, వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ సినిమా విడుదలకు సిద్దమైంది. ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాని ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. తన తర్వాతి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటించనుందన్న వార్తలపై స్పందించారు.

మీ తర్వాతి సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా ఫిక్స్ అయిందట కదా?, నిజమేనా? అని అడగగా ‘నా తదుపరి సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేస్తుందనేది కేవలం రూమర్‌ మాత్రమే. బహుశా జాన్వీని తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. నేను కొన్ని రోజులుగా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. కాబట్టి నా నెక్స్ట్ ప్రాజెక్ట్‌ గురించి పూర్తి వివరాలు తెలియదు’ అని నాని సమాధానం ఇచ్చారు. శైలేష్ కొలను లేదా సుజిత్ దర్శకత్వంలో నాని నటించనున్నారని తెలుస్తోంది.

Share this post

scroll to top