కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్.. 

janivi-21-.jpg

పారిస్‌లో ఈనెల 13వ తేదీన అట్ట‌హాసంగా 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫ్యాషన్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ఈ వేడుక ఈనెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఈసారి ఈ వేడుకలో కొందరు స్టార్స్ తొలిసారి సందడి చేయబోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు ఇండస్ట్రీలకు చెందిన తారలు రెడ్‌కార్పెట్‌పై విభిన్న వస్త్రధారణతో అడుగుల వేసి ఆకట్టుకున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తొలిసారి కేన్స్‌లో మెరిశారు.

జాన్వీ క‌పూర్, ఇష‌న్ క‌ట్ట‌ర్ జంట‌గా న‌టించిన హోమ్‌బౌండ్ సినిమా ప్రీమియర్ జ‌రుపుకోగా, దాని కోసం జాన్వీ కేన్స్‌లో తొలిసారి అడుగుపెట్టింది. ఇక ఈ వేడుకలో జాన్వీ లుక్స్ చూపరులను కట్టిపడేసింది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీ రూపొందించిన మెటాలిక్ పింక్ కలర్ ప్రీ-డ్రేప్డ్ సారీతో రెడ్ కార్పెట్‌పై న‌డిచి అందరి దృష్టిని త‌న‌వైపుకి తిప్పుకుంది. అంతేకాదు తన లుక్‌తో అతిలోక సుందరి శ్రీదేవిని గుర్తుచేశారు. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ కేన్స్ లుక్స్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, ఈ ఏడాది కేన్స్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం హోమ్‌బౌండ్ కావడం విశేషం.

Share this post

scroll to top