హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవి లత పై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధవి లతను ప్రాస్టిట్యూట్ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బీజేపీ నేతలు మాధవి లతని ఎందుకు పెట్టుకున్నారో తెలియదని ఆమె పెద్ద వేస్ట్ వ్యక్తి అంటూ కామెంట్ చేశారు. అయితే అంతకు ముందు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాడిపత్రిలోని జెసి పార్క్ వైపు మహిళలు ఎవరు వెళ్లకూడదు అని మాధవి లత సూచనలు చేశారు. అక్కడ అత్యంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయని ఆమె వీడియో రిలీజ్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు జెసి ప్రభాకర్ రెడ్డి. మాధవి లత వ్యాఖ్యలను తప్పుపడుతూ మహిళలను అవమానించేలా మాధవి లత మాట్లాడారని జేసీ పార్కులో ఎలాంటి సంఘటనలు జరగడంలేదని అన్నారు.