నరికేస్తా రవాణాశాఖ అధికారులకు జేసీ ఓపెన్‌ వార్నింగ్‌

jc-prabhakar-19.jpg

ఐదేళ్ల పాటు అధికార దాహంతో రగిలిపోయిన టీడీపీ సీనియర్లు.. ఇప్పుడు తమ అసలు రూపం ప్రదర్శిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్‌ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోయారు. రవాణా శాఖ అధికారులను ఉద్దేశించి.. నరికేస్తానంటూ వ్యాఖ్యానించారు. అనంతపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ జేసీ ఈ వార్నింగ్‌ ఇవ్వడం గమనార్హం. జేసీ ట్రావెల్స్‌ బస్సులు, లారీలను సీజ్‌ చేసిన వాళ్లందరిపై ప్రతీకారం తీర్చుకుంటా అంటూ ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు. ఈ క్రమంలో రవాణా శాఖ జేటీసీ శివరాం ప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అత్తికానాజ్ లను వదలను అంటూ నేరుగా బెదిరించారాయన.

Share this post

scroll to top