ఎన్టీఆర్‌కు చేతికి గాయం..

ntr-14.jpg

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గత రాత్రి హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో తారక్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు పుకార్లు పుట్టించారు కొందరు. దాంతో తారక్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తలను ఎన్టీఆర్ టీమ్ ఖండించింది. ‘జిమ్‌ చేస్తుండగా ఎన్టీఆర్‌ ఎడమ చేతికి రెండు రోజుల క్రితం చిన్న గాయం అయ్యింది. అయినప్పటికీ తారక్ ‘దేవర’ షూటింగ్‌లో మంగళవారం పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయకు పెద్ద ప్రమాదం జరిగినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. దయచేసి ఆ ప్రచారాన్ని అభిమానులు నమ్మకండి అని ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది.

Share this post

scroll to top