కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్ అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలు, ఇండ్లపైకి దాడులకు వస్తామంటే భయపడే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. యాదాద్రి భోనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 60లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బీఆర్‌ఎస్ పార్టీ అని కార్యకర్తలు తలచుకుంటే కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదు ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసినా పార్టీ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. రౌడీ మూకలను వేసుకొని పార్టీ కార్యాలయాలపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి కాదని మాటలతో, విజ్ఞతతో, నిబద్ధతతో ప్రజల కోసం పోరాటం చేసే సంస్కృతి బీఆర్‌ఎస్‌దన్నారు.