నాదనాథుడి ఉగ్రరూపం..

vishnu-15.jpg

మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్‌’ సిరీస్‌ ఫేమ్‌ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్, మోహన్‌ బాబు, అక్షయ్‌ కుమార్, మోహన్‌ లాల్, శరత్‌ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్‌ అగర్వాల్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా శరత్‌ కుమార్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ మూవీలో ఆయన నటిస్తున్న నాదనాథుడి పాత్ర పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని ఉగ్రరూపంలో ఉన్న ఓ యోధుడిలా కనిపిస్తున్నారు శరత్‌ కుమార్‌. ‘‘శివ భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో ఈ సినిమాపై మరింత బజ్‌ ఏర్పడింది. ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్, విజువల్స్‌ గురించి అందరూ మాట్లాడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు న్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Share this post

scroll to top