తన వద్ద కూడా రెడ్ బుక్ ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. రెడ్ బుక్ గురించి అఖిల ప్రియ కంటే ముందు లోకేష్ రెడ్ బుక్ చూపించి మీ కథ చేస్తా అని అంటున్నారని అన్నారు. లీడర్ ఏ దారిలో నడిస్తే ఆ పార్టీ నాయకులు కూడా అదే దారిలో నడుస్తారని చెప్పారు. ఎన్ని రోజులు ఈ రెడ్ బుక్ సంస్కృతి నడుస్తాదో చూడాలని అన్నారు. ప్యాక్షన్ రాజకీయాలు వద్దని 2004లో ఫ్యాక్షన్ రాజకీయాల సంస్కృతికి స్వస్తి పలికాం అని అన్నారు. టీడీపీ నాయకులు అందరూ రెడ్ బుక్ పెట్టుకొని అదే పాలన కావాలంటే ఎవరూ ఏమి చేయలేరని అన్నారు. ప్రజల వద్ద రెడ్ బుక్ పాలన ఇలాంటి రాజకీయాలు చెల్లవు అని చెప్పారు. ఓటు అనే ఆయుధంతో ప్రజలు ఎవరికి ఎలా బుద్ధి చెప్తారో అలా చెప్తారని పేర్కొన్నారు. టీడీపీ నాయకుల నుండి ఫోన్ వస్తే పోలీసులు వారికి అనువుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపొద్దు..
