వైసీపీ పార్టీ కీలక నేత, ధర్మవరం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కొత్త గెటప్ లో కనిపించారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పైలెట్ గా మారిపోయారు. హైదరాబాద్ మహానగరంలో ప్రైవేట్ జెట్ నడిపారు మాజీ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. సొంతంగా ప్రైవేట్ జెట్ నడుపుతూ హైదరాబాద్ ఆకాశ వీధిలో తేలిపోయారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. దీంతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నడిపిన విమానం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రైవేట్ జెట్ నడపడం చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రైవేట్ జెట్ నడిపిన కేతిరెడ్డి..
