గ్రామపంచాయతీలో నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమల పాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో విష జ్వరాల భారిన పడిన వారిని మంత్రి సందర్శించారు. గత గడిచిన పది సంవత్సరాల కాలంలో గ్రామాల్లో మౌలిక వస్తులపై నిర్లక్ష్యం వహించటం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. మొన్నటి వరకు నేను నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగానని తెలిపారు. వందలాదిగా నాకు అప్లికేషన్లు వచ్చాయి గ్రామాల్లో మౌలిక వసతులు సరిగా లేవని తెలిపారు.మేము అంత చేసాం ఇంత చేసామనే ప్రభుత్వం ఏమి చేయలేదన్నారు. మేము ఇచ్చిన మాట ప్రకారం ఒక పాలేరు నియోజకవర్గం లోనే కాదు రాష్ట్రమంతా పేదలకు అండగా ఉంటామన్నారు.
గ్రామపంచాయతీలో నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే..
