భారీ బడ్జెట్ సినిమా నుండి కియారా ఔట్..

krithi-sanon-26.jpg

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీకి ప్రెగెన్సీ రావడంతో ఓ క్రేజీ ప్రాజెక్టు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. పర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న డాన్ 3లో రణవీర్ సింగ్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ మిస్సయ్యింది. ఈ ఆఫర్ ఎవరికి దక్కుతుందో అనుకునేలోగా యంగ్ బ్యూటీ శార్వరీ వాఘ్ పేరు గట్టిగానే వినిపించింది. తనే ఫైనల్ కాబోతున్నట్లు ఇక కాల్షీట్స్ రెడీ చేసుకోవడమే అని సంబరపడిపోయింది ముంజ్య బ్యూటీ. కానీ అమ్మడికి ఆ ఛాన్స్ రాలేదు. ఆ ఆఫర్ ఎగరేసుకుపోయింది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ క్రితి సనన్.

క్రితి సనన్‌ ను డాన్ 3 హీరోయిన్‌గా ఫైనల్ చేసిందట టీం. జూనియర్ కన్నా సీనియర్ యాక్ట్రెస్ అయితే బెటర్ అని భావించి క్రితికే ఓటు వేసిందని సమాచారం. షారూఖ్ ప్లేసులోకి రణవీర్ సింగ్ వచ్చినట్లే ఇప్పుడు కియారా ప్లేసును ఆక్యుపై చేసింది మిమి. అక్టోబర్ లేదా నవంబర్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ యాక్షన్ పిక్చర్‌గా తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ పర్హాన్ అక్తర్. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్లో పెట్టేస్తోంది క్రితి సనన్. ప్రజెంట్ ఆనంద్ ఎల్ రాయ్- ధనుష్ కాంబోలో వస్తున్న తేరే ఇష్క్ మేలో నటిస్తోంది. షాహీద్ కపూర్ సరసన కాక్ టైల్2తో పాటు నయీ నవేలీ అనే హారర్ థ్రిల్లర్‌లోనూ కనిపించబోతుంది. ఇలా వరుస ఆఫర్లను కొల్లగొడుతూ  అటు స్టార్ హీరోయిన్లకు ఇటు జూనియర్ భామలకు గట్టిపోటీనిస్తుంది దో పత్తి బ్యూటీ.

Share this post

scroll to top