థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ పరీక్ష ద్వారా థైరాయిడ్ లెవల్స్ ను గుర్తించవచ్చు. 0 నుంచి 2 వారాల శిశువులో టీ.ఎస్.హెచ్ స్థాయి 1.6-24.3 mU/L ఉండాలి. అదే 2 నుంచి 4 వారాల పిల్లలలో టీ.ఎస్.హెచ్ సాధారణ స్థాయి 0.58-5.57 mU/L గా ఉండాలి. 20 వారాల నుంచి 18 సంవత్సరాల పిల్లలలో థైరాయిడ్ సాధారణ స్థాయి 0.55-5.31 mU/L గా ఉంటుంది. గుర్తుంచు కోండి.. వీటి కంటే ఎక్కువ లేదా తక్కువ టీ.ఎస్.హెచ్ స్థాయి కలిగి ఉంటే థైరాయిడ్ సమస్య ఉన్నట్లే.
ఇటీవల చాలా మంది చిన్నారుల్లో థైరాయిడ్ సమస్య పుట్టుకతోనే వస్తోంది. అంతే కాకుండా బిడ్డ నెలలు నిండకుండా పుడితే కూడా కొందరిలో థైరాయిడ్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను నివారించడానికి, తల్లి గర్భం నుండే బిడ్డకు సరైన పోషకాహారాన్ని అందించాలి.
హషిమోటో థైరాయిడిటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా థైరాయిడ్‌కు కారణం కావచ్చు. అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ ప్రోబ్లమ్స్ తలెత్తుతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది శరీరం రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిని దెబ్బతీయడం ప్రారంభించే పరిస్థితి. తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డకు సరైన పోషకాహారం అందకపోతే థైరాయిడ్ సమస్యలు రావచ్చు.
మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఊబకాయం సమస్య.
థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరగడం.
కళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం.
పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల తగ్గుతుంది
పిల్లలు అలసిపోయినట్లు అనిపిస్తుంది
త్వరగా అనారోగ్యానికి గురవుతారు
పిల్లల చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది
ఎముకలు, జుట్టు, దంతాలు బలహీనమవుతాయి.