ఎన్టీఆర్ క్లాసీ క్యాజువల్ బట్టలు ధరించి ముంబై ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ టైమ్ లో తారక దగ్గర ఉన్న అన్ని వస్తువుల కంటే ఆయన పెట్టుకున్న అల్ట్రా లగ్జరీ వాచ్ పై పడింది మూవీ లవర్స్ దృష్టి. దీంతో ఆ వాచ్ కు ఉన్న స్పెషాలిటీ ఏంటి? ధర ఎంత ? అనే విషయాలను ఆరా తీయడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ ధరించిన ఈ అద్భుతమైన వాచ్ రిచర్డ్ మిల్లె అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ కు సంబంధించింది.
ఈ వాచ్ పూర్తి పేరు రిచర్డ్ మిల్లె 40-01 టూర్ బిల్లాన్ మెక్ లారెన్ స్పీడ్ టైయిల్. ఇక దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ రిచర్డ్ మిల్లె లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ధర రూ. 7.47 కోట్లు. ఈ విషయం తెలిసిన సినీ ప్రియులు ఆ వాచ్ కు ఎన్టీఆర్ ఖర్చు పెట్టిన డబ్బుతో ఓ మిడిల్ క్లాస్ లైఫ్ సెట్టు అంటూ నోరు వెళ్లబెడుతున్నారు. గతంలోనూ ఎన్టీఆర్ ఈ వాచ్ పెట్టుకుని కనిపించారు. ముంబైలో వార్ 2 షూటింగ్ టైంలో, అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్ ఈవెంట్ లోనూ ఇదే వాచ్ పెట్టుకున్నారు ఎన్టీఆర్.