కొడాలి నాని సంచలన నిర్నయం..

nani-19.jpg

వైకాపా నేత కొడాలి నాని సంచలన నిర్నయం తీసుకున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు కొడాలి నాని. మచిలీపట్నం పోలీసులు తనపై గతేడాది జూన్ లో నమోదు చేసిన కేసును రద్దు చేయాలని వైకాపా నేత కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టారని, సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవని పేర్కొన్నారు. పోలీసులు తనకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని కోర్టును కోరారు వైకాపా నేత కొడాలి నాని. ఇక ఇప్పటికే అనేక రకాల కేసుల్లో వైసీపీ పార్టీ నేతలపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. దీంతో కొంత మందిని ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు కూడా! పోసాని, అనిల్‌ లాంటి చాలా మంది లీడర్లు అరెస్ఠ్‌ అయ్యారు. ఈ తరుణంలోనే మచిలీపట్నం పోలీసులు తనపై గతేడాది జూన్ లో నమోదు చేసిన కేసును రద్దు చేయాలని వైకాపా నేత కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Share this post

scroll to top